అపురూపమైన వస్తువని ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.. అదేమిటో తెలిశాక 'యాక్' అన్నారు!
- విమానం నుంచి జారిపడ్డ ఘన పదార్ధం
- ఘన రూపంలో ఉన్న వ్యర్థాలు
- అపురూప సంపద అనే భావంతో ఫ్రిజ్ లో పెట్టుకున్న కొందరు వ్యక్తులు
ఆ తర్వాత ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో వాతావరణ శాఖ అధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు గ్రామానికి చేరుకుని, ఆ పదార్థాన్ని పరీక్ష చేసి, అసలైన విషయాన్ని వెల్లడించారు. దీంతో, వాటిని ఫ్రిజ్ లో పెట్టుకున్న వారంతా అవాక్కయ్యారు. యాక్ అంటూ వాంతులు చేసుకున్నారు. వాస్తవానికి దాన్ని బ్లూ ఐస్ అంటారు. విమానాల్లో మలమూత్రాలను ఘన రూపంలో భద్రపరుస్తారు. అప్పుడప్పుడు అవి విమానాల నుంచి లీకై కిందకు పడుతుంటాయి. కొన్నిసార్లు వాటిని నిర్దేశిత ప్రాంతాల్లో కూడా జారవిడుస్తుంటారు. విషయం తెలిసిన తర్వాత ఫ్రిజ్ లలో ఉన్న ఆ మలమూత్ర వ్యర్థాలను బయటపడేయటానికి వారు నానా తంటాలు పడ్డారు.