ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కుమారుడి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

  • ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం
  • కారులో ఎమ్మెల్యే సతీమణి పుష్పలత
  • బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన పెను ప్రమాదం
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు లోపలి బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్‌రెడ్డి కారులో కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా సుల్తానాబాద్ సమీపంలోని సెయింట్ మేరీ పాఠశాల సమీపంలోని మలుపు వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే భార్య పుష్పలత ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవడంతో  స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Telangana
Peddapalli
MLA
Accident

More Telugu News