వేధింపులు పడలేక.. భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య!

  • మద్యానికి బానిసైన భర్త
  • చర్మ వ్యాధి కూడా ఉండడంతో భర్తను ముట్టుకోని భార్య
  • వేధింపులు భరించలేక చివరకు భర్తపై దాడి
  • తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో ఘటన
వేధింపులు భరించలేక ఓపిక నశించిన ఓ మహిళ తన భర్తను కత్తిపీటతో నరికి చంపేసిన ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వేప్పందట్ట, తోండమాదూరులో చోటుచేసుకుంది. సెల్వరాజ్‌, లూర్థుమేరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సెల్వరాజ్‌ మద్యానికి బానిస అయ్యాడు. ఆయన కొన్ని సంవత్సరాలుగా చర్మవ్యాధితో కూడా బాధపడుతున్నాడు. దీంతో లూర్థుమేరి ఆయనను ముట్టుకోవడం లేదు. సెల్వరాజ్ మాత్రం మద్యం తాగి ఇంటికి వచ్చి ఆమెను లైంగికంగా వేధించే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా మరోసారి తాగి వచ్చి వేధింపులకు దిగిన సెల్వరాజ్‌ని ఆమె కత్తిపీటతో నరికి చంపేసింది. అనంతరం ఆమె పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. 
Go Back to Shorts
husband
killed
by
wife

More Telugu News