దేశంలో అందరికీ ఆరోగ్య బీమా పథకం... కేంద్రం మదిలో ఆలోచన!
- బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం
- రూ.3-5 లక్షల వరకు బీమా కవరేజీ
- రూ.2 లక్షల్లోపు ఆదాయ వర్గాలకు ఉచితం
- ఓ హిందీ దినపత్రికలో కథనం
ఆరోగ్య బీమాను మూడు వర్గీకరణలు చేయడం ద్వారా... దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి కోసం కేంద్రమే బీమా ప్రీమియం భరిస్తుంది. దీని పేరు కల్యాణ్. అలాగే, రూ.2 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారి ప్రీమియం కూడా కేంద్రమే భరిస్తుంది. దీని పేరు సౌభాగ్య. రూ.2 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు పరిమితంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని పేరు సర్వోదయ. ఇది ఎంత వరకూ వాస్తవమో తెలియాలంటే బడ్జెట్ వరకూ వేచి చూడాల్సిందే.