rajnikant: ఆరు నెలల్లో ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు నేను సిద్ధం: రజనీకాంత్

షార్ట్స్‌లో చూడండి
ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి తాను సిద్ధమేనని సినీనటుడు రజనీకాంత్ అన్నారు. ఈ రోజు కమల హాసన్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల వ్యూహం గురించి తాను ఏమీ చెప్ప‌బోన‌ని, వేచి చూడాలని సమాధానమిచ్చారు.

తమ ప్రణాళికలో భాగంగా తమ పార్టీ ఆఫీస్‌ బేరర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. కాగా, సినీ రంగంలో సన్నిహిత మిత్రుడైన కమల హాసన్‌తో తాను రాజకీయాల్లోనూ కలిసి ప‌నిచేస్తానో లేదో అన్న ప్ర‌శ్న‌కు కూడా కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. క‌మ‌ల హాస‌న్ రాజ‌కీయ పార్టీకి అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
rajnikant
party
Kamal Haasan

More Telugu News