Allu Arjun: నెక్స్ట్ మూవీ విషయంలో ఆలోచనలో పడిన అల్లు అర్జున్!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఒక కొత్త దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ డైరెక్టర్ వినిపించిన లైన్ బాగా నచ్చడం వల్లనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అన్నారు.

 అయితే తాజాగా పూర్తి స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ కి వినిపించిన ఆ దర్శకుడు, ఆయనను మెప్పించలేకపోయాడని టాక్. దాంతో అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. నెక్స్ట్ సినిమాను స్టార్ డైరెక్టర్స్ తోనే చేయాలనే నిర్ణయానికి వచ్చాడట. అయితే రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల .. బోయపాటి .. పూరీ .. చందూ మొండేటి .. అనిల్ రావిపూడి .. ఇలా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా వున్నారు. దాంతో ఏ కథను ఎంపిక చేసుకుని .. ఎవరితో సెట్స్ పైకి వెళ్లాలనే విషయంలో అల్లు అర్జున్ సతమతమవుతున్నాడని చెప్పుకుంటున్నారు.   
Go Back to Shorts
Allu Arjun

More Telugu News