మరో కీలక నిర్ణయం తీసుకున్న కమలహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో కీలక నిర్ణయం తీసుకున్న కమలహాసన్

  • రాష్ట్ర పర్యటనకు రెడీ అయిన కమల్
  • 26న పర్యటన ప్రారంభం
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్న కమల్
విలక్షణ నటుడు కమలహాసన్ రాజకీయ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పార్టీ ప్రకటన కంటే ముందుగానే ఆయన రంగంలోకి దిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోందని... ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తన పర్యటన అని తెలిపారు. జనవరి 26న తన పర్యటన మొదలవుతుందని చెప్పారు. ఆనంద్ వికటన్ తదుపరి సంచికలో పర్యటన వివరాలను వెల్లడిస్తానని అన్నారు. మైయ్యామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయని చెప్పారు. త్వరలోనే అవినీతి తిమింగలాల బండారాన్ని బయటపెడతానని తెలిపారు. 
Kamal Haasan
kamal yatra

More Telugu News