సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తెలుగుతెరపై నిత్యా మీనన్ కొత్త ప్రయోగం! 
  • రెండు గంటలు కూడా లేని రజనీ సినిమా!
  • దిల్ రాజు చేతిలో సోషియో ఫాంటసీ చిత్రం 
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రవితేజ సినిమా
*  డేరింగ్ కథానాయికగా పేరు తెచ్చుకున్న నిత్యా మీనన్ ప్రస్తుతం ఓ చిత్రంలో లెస్బియన్ పాత్రలో నటిస్తోందట. ఇందులో మరో హీరోయిన్ తో కలసి లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేస్తుందట. మరి, ఈ ప్రయోగం తెలుగు తెరపై ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
*  రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న '2.o' (రోబో  సీక్వెల్) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం రన్ టైంను 100 నిమిషాలుగా సెట్ చేశారట. అంటే రెండు గంటల నిడివి కూడా వుండదన్న మాట. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండడమే కోసమే ఈ విధంగా నిడివిని తగ్గించినట్టు చెబుతున్నారు.    
*  తాజాగా 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని నైజాం ప్రాంతంలో పంపిణీ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు మరో భారీ చిత్రం పంపిణీ హక్కులను కూడా తీసుకున్నారు. జయప్రద ప్రధాన పాత్రధారిణిగా, ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా రూపొందిన 'శరభ' సోషియో ఫాంటసీ చిత్రం నైజాం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు.  
*  రవితేజ హీరోగా విక్రం సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న 'టచ్ చేసి చూడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే 'పుష్ప ..' అంటూ సాగే పాటకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తారు. రాశిఖన్నా, శీరత్ కపూర్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.     
Nitya
rajani
jayaprada
Raviteja

More Telugu News