Balakrishna: పెనుకొండలో బాలయ్య సందడి.. సినీ డైలాగులతో ఉర్రూతలూగించిన వైనం!

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పెనుకొండ పట్టణంలో సందడి చేశారు. స్థానిక మడకశిర కూడలిలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు.

తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల ద్వారా రాయలసీమకు నీరందించాలని ఆనాడే ఎన్టీఆర్ కలలుగన్నారని చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ కలలను నిజం చేశారని తెలిపారు. దీనికి తోడు కియా, బెల్ నాసన్ తదితర పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి, ఈ ప్రాంత అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సినిమా డైలాగులు చెప్పి అందరినీ ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు తరలి వచ్చారు.
Go Back to Shorts
Balakrishna
ntr
Chandrababu

More Telugu News