Kamal Haasan: మా జీవితాల్లో ఆయనే బ్రహ్మ: సినీ నటి జయప్రద

షార్ట్స్‌లో చూడండి
నాటి క్లాసిక్ ‘సాగరసంగమం’ చిత్రం గురించి, అందులోని తన పాత్ర గురించి సినీ నటి జయప్రద ప్రస్తావిస్తూ ఎంతో పొంగిపోయారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘దర్శక బ్రహ్మ అని ఎంతో మంది పిలుచుకున్నా, మా జీవితాల్లో ఆయనే (దర్శకుడు కె.విశ్వనాథ్) మాకు బ్రహ్మ. ఆయన (దర్శకుడు కె.విశ్వనాథ్) లేకుంటే, నేను కానీ, కమలహాసన్, చంద్రమోహన్ గారు కానీ ఎవరూ ఉండరు.

పాత్రలను సృష్టించడమనేది ఒక ఛాలెంజ్ అయితే, ఆ పాత్రలతో నటింపజేయడమనేది మరో ఛాలెంజ్. ఈ సినిమాలో ఒక్కో షాట్ లో నేను ఎంత నవ్వాలి, నా పెదాలు ఎంత వరకు ఓపెన్ అవ్వాలి.. ఇలా ప్రతిదీ దర్శకుడు చెబితేనే చేయగలిగాను. నా పాత్రను బ్యాలెన్స్ చేయడానికి దర్శకుడు అవసరం. ఆయన (దర్శకుడు కె.విశ్వనాథ్) ప్రతి సన్నివేశంలో కూడా నేను ఎంత నవ్వాలి, నా పెదవి ఎంత ఓపెన్ అవ్వాలి.. అనే వాటిని దర్శకుడు చెప్పేవారు’ అని జయప్రద అన్నారు.
Go Back to Shorts
Kamal Haasan
jayaprada

More Telugu News