'మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్' అన్న విద్యార్థిని.. చిరునవ్వు చిందించిన సీఎం!
- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవంలో విద్యార్థులతో ముఖాముఖి
- ‘సమర్థుడైన ముఖ్యమంత్రి’
- ‘విద్యార్థినులతో ముఖాముఖి’లో చంద్రబాబుపై ప్రశంసలు
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ‘మీరు ఇచ్చిన సైకిళ్ల వల్ల ఎంతోమంది అమ్మాయిలు తమ చదువును కొనసాగిస్తున్నారు. అన్ని తరగతుల బాలికలకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. మీరు చాలా ట్రెండీగా ఉంటారు సార్’ అని ఆ విద్యార్థిని అనడంతో చంద్రబాబు సహా అందరూ నవ్వులు చిందించారు.
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం బాగుందని, విద్యోన్నతి పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశంసించారు. రాష్ట్రానికి సమర్థుడైన ముఖ్యమంత్రి లభించడం తమకు సంతోషంగా ఉందని, సమస్యల పరిష్కారానికి పట్టువీడని పోరాటం చేస్తున్న చంద్రబాబును గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తో అభివర్ణిస్తూ ఆయా విద్యార్థినులు ప్రశంసించడం గమనార్హం.