నిహారిక తమిళ మూవీ ఆడియో ఫంక్షన్ మలేసియాలో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిహారిక తమిళ మూవీ ఆడియో ఫంక్షన్ మలేసియాలో!

  • తెలుగులో 'ఒక మనసు' చేసిన నిహారిక
  • తమిళంలో గౌతమ్ కార్తీక్ జోడీగా 
  • ఈ నెల చివరిలో విడుదల    
నిహారిక ఒక వైపున కథానాయికగా పద్ధతి గల పాత్రలను చేస్తూనే, మరో వైపున వెబ్ సిరీస్ లు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలుగులో 'ఒక మనసు' సినిమా చేసిన నిహారిక, తాజాగా తమిళంలో 'ఒరు నల్ల నాల్ పాతు సోల్రేమ్' సినిమా చేసింది. గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించాడు.

 అడ్వెంచర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి, ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టేశారు. ఈ సినిమా ఆడియో వేడుక ఈ సాయంత్రం 6 గంటల నుంచి మలేసియాలో ఘనంగా మొదలుకానుంది. 'నడిగర సంఘం నైట్ ఇన్ మలేసియా' అనే కార్యక్రమంలో, అదే వేదికపై ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేయనున్నారు.        
niharika
goutam karthik

More Telugu News