ఆకట్టుకుంటోన్న విశాల్ 'అభిమన్యుడు' టీజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆకట్టుకుంటోన్న విశాల్ 'అభిమన్యుడు' టీజర్

  • విశాల్ తాజా చిత్రంగా 'అభిమన్యుడు'
  • విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ 
  • డాక్టర్ పాత్రలో సమంత
తెలుగు .. తమిళ భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన 'ఇరుంబుతిరై' .. తెలుగులో 'అభిమన్యుడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను వదిలారు. సినిమా భారీ తనానికి ఈ టీజర్ అద్దం పడుతోంది.

పెరుగుతోన్న టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని, జనం జీవితాలను కొంతమంది ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందనే విషయాన్ని ఈ టీజర్ చెబుతోంది. "ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు .. నీ గురించిన ఓ చిన్న ఇన్ఫర్మేషన్ చాలు" అనే డైలాగ్ అందుకు నిదర్శనం. ఆర్మీ ఆఫీసర్ గా విశాల్ ఫైట్స్ .. విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ వ్యూహాలతో ఈ టీజర్ దుమ్మురేపేస్తోంది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, రెండు భాషల్లోను త్వరలోనే విడుదల కానుంది.
vishal
samanta

More Telugu News