Chandrababu: పబ్లిసిటీ కోసం ‘జన్మభూమి’ సభల్లో కొంతమంది గొడవలు సృష్టిస్తున్నారు: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
పబ్లిసిటీ కోసం కొంతమంది ‘జన్మభూమి’ సభల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈరోజు నిర్వహించిన ‘జన్మభూమి’లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయాలకు వేదికగా ‘జన్మభూమి’ని చేయాలని కొంతమంది అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా పులివెందులలో నిన్న నిర్వహించిన ‘జన్మభూమి’ గురించి ఆయన ప్రస్తావించారు.

ఆ సభలో అక్కడి ఎంపీ గలాటా సృష్టించాలని ప్రయత్నించారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లలో అందిస్తున్నామని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా ‘1100’కు ఫోన్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్ట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తికానుందని, ఇది కనుక పూర్తయితే ఇచ్ఛాపురం వరకు నీరిస్తామని అన్నారు. వంశధార- నాగావళి అనుసంధానానికి, శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.  
Go Back to Shorts
Chandrababu
janmabhoomi

More Telugu News