mohan babu: మూడు షిఫ్ట్‌లూ వాడితోనే గడుపుతున్నాను: మోహన్‌ బాబు హర్షం

షార్ట్స్‌లో చూడండి
సినీనటుడు మంచు విష్ణు మ‌రోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆయ‌న భార్య విరోనికా ఇటీవలే పండంటి బాబుకి జన్మనివ్వడంతో మంచు వారి కుటుంబం ఆ బాబుతో సందడిగా గడుపుతోంది. తాజాగా మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు చేసిన ఓ ట్వీట్ అలరిస్తోంది.

'నా బిడ్డలు పుట్టినప్పుడు... 3 షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్ లూ వాడితోనే గడుపుతున్నాను' అంటూ ఆయన హర్షం వ్యక్తం చేశాడు. ఇప్పటికే మంచు విష్ణు, విరోనికాలకి ఇద్దరు కవల ఆడపిల్లలు ఉండగా ఇప్పుడు మూడో బిడ్డగా బాబు జన్మించాడు. 
Go Back to Shorts
mohan babu
manchu vishnu
Successor

More Telugu News