మరుగుజ్జు పాత్రలో షారుక్... ఆకట్టుకుంటున్న `జీరో` టీజర్
- దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్
- హీరోయిన్లు అనుష్క శర్మ, కత్రినా కైఫ్
- 2018, డిసెంబర్ 21న విడుదల
గతంలో షారుక్, కత్రినా, అనుష్క శర్మలు కలిసి 'జబ్ తక్ హై జాన్' సినిమాలో నటించారు. ఈ చిత్రానికి షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ చిత్ర టీజర్‌లో మరుగుజ్జు పాత్రలో షారుక్ చేస్తున్న డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర కోసం షారుక్‌ని మించిన నటుడు మరొకరు దొరకలేదని, ఆయన అయితేనే పాత్రకు న్యాయం చేయగలరని టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ అన్నారు.