Pawan Kalyan: రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాపై కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నా: పవన్ కల్యాణ్
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యంపై సీఎం కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నానని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ ను తొలిసారిగా ఈ సాయంకాలం పవన్ కల్యాణ్ కలిశారు. కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు ఈ రోజు సాయంత్రం పవన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, పలు విషయాలపై వారు చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా, పవన్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయానని, ఈ విషయమై కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నానని చెప్పారు. హక్కుల సాధనకు కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ నేతలకు చెబుతానని అన్నారు. తెలంగాణలో తనకు అభిమానులు ఉన్నారని, తన బలం తనకు ఉందని, ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు తనకు సమయం లేకపోవడంతోనే వెళ్లలేకపోయానని చెప్పారు.