విక్రమ్ .. తమన్నా మూవీ ఆగలేదు .. వస్తోందట!
- విక్రమ్ హీరోగా 'స్కెచ్'
- తమిళంలో సంక్రాంతికి విడుదల
- తెలుగులో జనవరి 26న
ఈ విషయం పట్ల ఈ సినిమా నిర్మాతలు స్పందిస్తూ, జరుగుతోన్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని అన్నారు. తెలుగులోను ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇక్కడ గట్టిపోటీ ఉండటంతో, ఆ ఆలోచనను విరమించుకున్నారు. తెలుగులో ఈ సినిమాను నిర్మాత సురేశ్ బాబు సమర్పిస్తుండగా, జనవరి 26వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.