అందుకే మోహన్ బాబు నాతో మళ్లీ సినిమా చేయలేదేమో: దర్శకుడు వంశీ

  • మోహన్ బాబుతో 'డిటెక్టివ్ నారద' చేశాను
  • ఆయన ఎంతమాత్రం ఇబ్బంది పెట్టలేదు  
  • ఆ సినిమా సరిగ్గా ఆడలేదు
"ఇండస్ట్రీలో మీరు చాలా ముక్కుసూటి మనిషి .. అంతే ముక్కుసూటి మనిషిగా పేరున్న మోహన్ బాబుతో కలిసి మీరు 'డిటెక్టివ్ నారద' కోసం పనిచేయవలసి వచ్చింది. ఆయనతో మీరేవైనా ఇబ్బందులు ఫేస్ చేశారా?" అనే ప్రశ్న దర్శకుడు వంశీకి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. " మోహన్ బాబు గారితో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు. నేను ఏది చెబితే ఆయన అది చేశారు. ఏ రోజున ఆయన నన్ను ఏ విధంగాను ఇబ్బంది పెట్టలేదు" అన్నారు.

 ' నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం అని ఆయన మీకు అడ్వాన్స్ ఇచ్చారు .. కానీ చేయలేదు .. ఎందుకని?' అని వంశీ గారిని అడిగితే, " ఇక్కడ సక్సెస్ మాట్లాడుతుంది కదా .. మరేమో 'డిటెక్టివ్ నారద' ఆడలేదు. అందువలన ఆయన ఆ ఆలోచనను విరమించుకుని ఉండవచ్చు. ఆ తరువాత కూడా ఆయనను నేను కలుసు కోవడం జరిగింది .. ఆయన నన్నెంతో మర్యాద పూర్వకంగా చూశారు" అని చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
vamsi
mohan babu

More Telugu News