రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన కమలహాసన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన కమలహాసన్!

  • రాజకీయాల్లోకి వస్తున్నందుకు శుభాకాంక్షలు
  • సమాజం పట్ల మీకున్న నిబద్ధత అభినందనీయం
  • ట్వీట్ చేసిన కమలహాసన్
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజనీకాంత్ కు విలక్షణ నటుడు కమలహాసన్ అభినందనలు తెలిపారు. "రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. సమాజం పట్ల మీకు ఉన్న నిబద్ధత అభినందనీయం. సుస్వాగతం" అంటూ కమల్ ట్వీట్ చేశారు. మరోపైపు, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇప్పటికే కమల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీని ప్రారంభిస్తానని... 2018లో పార్టీ వివరాలు ప్రకటిస్తానని ఆయన గతంలో తెలిపారు. మరోవైపు, రజనీ రాజకీయ ప్రకటనను పలువురు తమిళ సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. రజనీలాంటి వ్యక్తి తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలని వారు అభిలషిస్తున్నారు.
Rajinikanth
Kamal Haasan

More Telugu News