బీసీల కోసం సినిమాలు కూడా వదులుకుని వస్తా.. పోరాటం చేస్తా: సినీ నటుడు సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీల కోసం సినిమాలు కూడా వదులుకుని వస్తా.. పోరాటం చేస్తా: సినీ నటుడు సుమన్

  • బీసీ జాతి కోసం అజెండా సిద్ధం చేయండి
  • పార్లమెంటులో ఎంపీలు పోరాడాలి
  • బీసీ బిల్లును పార్లమెంటు ఆమోదించాలి
బీసీల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని... ఈ క్రమంలో అవసరమైతే సినీ రంగాన్ని కూడా వదులుకుని వస్తానని సినీ నటుడు సుమన్ అన్నారు. బీసీ బిల్లు కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసికట్టుగా పార్లమెంటులో పోరాడాలని ఆయన సూచించారు. బీసీ బిల్లును పార్లమెంటు ఆమోదించాలని అన్నారు. బీసీ జాతి అభ్యున్నతి కోసం ఎజెండాను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.  హైదరాబాదులో జరిగిన 'బీసీ విద్యార్థి గర్జన'కు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, బీసీలకు రాయితీలు కాదు, రాజ్యాధికారం కావాలని అన్నారు.
suman
bc bill
ponnala lakshmaiah

More Telugu News