sambasiva rao: పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందన!

షార్ట్స్‌లో చూడండి
ఈ నెలాఖరున ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ విరమణ చేస్తున్నారు. మంగళగిరిలోని ఏసీఎస్పీ 6వ బెటాలియన్ లో నిర్మించిన ఫిజియోథెరపీ హెల్త్ సెంటర్, ఇండో బ్యాడ్మింటన్ కోర్టు, సింథటిక్ టెన్నిస్ కోర్టు, ఇండోర్ జిమ్ లను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మీడియతో చిట్ చాట్ చేస్తూ, తాను నిర్వర్తించిన పదవీబాధ్యతల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

మావోయిస్టులకు అడ్డుకట్ట వేయడంలో కాని, కులపరమైన ఆందోళనలను అదుపు చేయడంలో కాని గట్టి ప్రయత్నమే చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది తనకు పూర్తి స్థాయిలో సహకరించారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు బదులుగా... తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఒకవేళ అటువైపు అడుగు వేసినా... మీడియాతో చెప్పాకే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. పదవీ విరమణ తర్వాత మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. 
Go Back to Shorts
sambasiva rao
ap dgp
Chandrababu

More Telugu News