తోడు కావాలి, విదేశాలు తిరగాలి... మడికట్టుకుని కూర్చోబోనన్న నటి హారిక... మెసేజ్ లను పోలీసులకు ఇచ్చిన దర్శకుడు యోగి!
- వాట్స్ యాప్ స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు ఇచ్చిన యోగి
- తన తప్పేమీ లేదని వాదిస్తున్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్
- వేరే దేశానికి వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని ఉంది
- మెసేజ్ లు పెట్టిన హారిక
ఈ సంభాషణల్లో తాను వ్యక్తిగతంగా ఆనందంగా లేనని యోగికి హారిక మెసేజ్ పెట్టినట్టు ఉంది. తనకు ఓ యువకుడి తోడు కావాలని, అతను ప్రేమను పంచుతూ ఆప్యాయంగా చూసుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పింది. ఆ బాయ్ ఫ్రెండ్ అంగీకరిస్తే, వేరే దేశానికి వచ్చేందుకు తాను సిద్ధమని కూడా చెప్పింది. అక్కడే కొంతకాలం హాయిగా బతకాలని ఉన్నట్టు చెప్పింది. తనకు సెక్స్ అక్కర్లేదని, కానీ, తనను చూసుకునే వాడికి అది కావాలంటే మాత్రం అభ్యంతరం లేదని చెప్పింది.
మళ్లీ పెళ్లి చేసుకుంటే కెరీర్ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మరో మెసేజ్ లో తాను సిగరెట్, మద్యం తాగుతానని, ఈ కాలంలో మడిగట్టుకుని కూర్చుంటే ఏం సాధిస్తామని ప్రశ్నించింది. తనకు సినిమా అవకాశాలు రావడం లేదని, అవకాశాల కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పింది. ఈ మెసేజ్ ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు పంపాడు యోగి.