samanta: డాక్టర్ రతీదేవి పాత్రలో కనిపించనున్న సమంత

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున తెలుగులో అగ్రకథానాయకుల సరసన నటిస్తూనే .. మరో వైపున తమిళంలో స్టార్ హీరోల జోడీగా సమంత నటిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే ఈ రెండు భాషల్లోను ఆమె అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. తాజాగా ఆమె తమిళంలో విశాల్ సరసన 'ఇరుంబు తిరై' సినిమా చేస్తోంది. రీసెంట్ గా విశాల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన పోస్టర్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'డాక్టర్ రతీదేవి'గా సమంత పాత్రను పరిచయం చేస్తూ ఆమె పోస్టర్ ను పరిచయం చేశారు.

 సైకాలజీలో పీహెచ్.డి చేసిన డాక్టర్ పాత్రలో సమంత ఈ సినిమాలో కనిపించనుంది. ఈ పాత్ర ద్వారానే ఈ సినిమా కథ మలుపు తిరుగుతుందని సమాచారం. విశాల్ సొంత బ్యానర్ లో పి.ఎస్.మిత్రన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది. జనవరి 26వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.     
Go Back to Shorts
samanta
vishal

More Telugu News