డాక్టరేట్ వేడుకకు హాజరుకాలేకపోయిన ప్రియాంక చోప్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాక్టరేట్ వేడుకకు హాజరుకాలేకపోయిన ప్రియాంక చోప్రా

  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే ఆగిపోయిన న‌టి
  • పొగమంచు వల్ల విమానరాకపోకలకు అంతరాయం
  • బాధ‌గా ఉంద‌ని వ్యాఖ్య‌
ఇటీవ‌ల బ‌రేలీ అంత‌ర్జాతీయ యూనివర్సిటీ వారు ప్రియాంక చోప్రాకు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వేడుక‌కు ప్రియాంక హాజ‌రుకాలేక‌పోయింది. బ‌రేలీకి వెళ్ల‌డానికి ప్రియాంక సిద్ధ‌మైన‌ప్ప‌టికీ పొగ‌మంచు కార‌ణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమాన‌రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌డం వ‌ల్ల ఆమె వెళ్ల‌లేక‌పోయింది.

హాజ‌రుకాలేక‌పోయినందుకు చాలా బాధ‌గా ఉంద‌ని ప్రియాంక మీడియాకు చెప్పింది. వేరే మార్గాల ద్వారా బ‌రేలీ వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ కుద‌ర‌లేద‌ని, త‌ర్వాత వీలు చూసుకుని త‌ప్ప‌కుండా బ‌రేలీ వెళ్తాన‌ని ప్రియాంక పేర్కొంది. కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ స‌మ‌క్షంలో బ‌రేలీ అంత‌ర్జాతీయ యూనివ‌ర్సిటీ ఛాన్స్‌ల‌ర్ కేశ‌వ్ కుమార్ అగ‌ర్వాల్ చేతుల మీదుగా ప్రియాంక గౌర‌వ డాక్ట‌రేట్ అందుకోవాల్సి ఉంది.
priyanka chopra
doctorate
delhi
airport

More Telugu News