సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అనుష్క అంటే ఇష్టమంటున్న లేటెస్ట్ బ్యూటీ 
  • విలన్ గా వస్తున్న మోహన్ బాబు 
  • హీరోగా ప్రముఖ దర్శకుడి తనయుడు 
  • రాజ్ తరుణ్ సరసన కొత్త హీరోయిన్
*  అందాల అనుష్కను అభిమానించే హీరోయిన్ల జాబితాలోకి యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరిపోయింది. అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలలో అనుష్క  పోషించినటువంటి పవర్ ఫుల్ రోల్స్ వేయాలనేది తన కల అని మెహ్రీన్ చెప్పింది. అనుష్కను తాను ఎంతగానో అభిమానిస్తానని, ఆమె నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందుతానని తెలిపింది.
*  విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం 'గాయత్రి' సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోగా.. విలన్ గా రెండు విభిన్న పాత్రలలో ఆయన కనిపిస్తారని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు, శ్రియా జంటగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదలవుతుంది.
*  నువ్వే కావాలి, మన్మధుడు వంటి పలు హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు విజయభాస్కర్ తనయుడు కమల్ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. గత కొన్నాళ్లుగా నటనలో శిక్షణ పొందుతున్న కమల్ త్వరలో కాళి అనే కొత్త దర్శకుడి చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది.
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ఓ కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించనుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు పూణేకు చెందిన రిద్ది కుమార్ ను ఎంపిక చేశారు.
Mehrin
mohanbabu
kamal
Rajtarun

More Telugu News