Vijayawada: మీసాలు తిప్పినా..తొడలు కొట్టినా బాలయ్య బాబుకే చెల్లుతుంది: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
‘జై సింహా’ ఆడియో సీడీని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. మొట్టమొదటి సీడీని నందమూరి బాలకృష్ణకు ఆయన అందజేశారు. ఆ తర్వాత ఎనిమిది సీడీలను చిత్రయూనిట్ కు అందజేశారు. అనంతరం, ఈ చిత్ర సీడీలను బాలకృష్ణ నుంచి ఏపీ మంత్రులు స్వీకరించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ‘అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను నారా భువనేశ్వరి పుత్రుడిని. నేను అలా చెప్పుకోవడానికి కారణం మా మామయ్య చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణియే. 1955లో నందమూరి తారకరామారావు నటించిన 'జయసింహ' చిత్రం ఎంతటి చరిత్ర సృష్టించిందో అంత చరిత్రను ‘జై సింహా’ కూడా సృష్టించాలి. మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా మన బాలయ్య బాబుకే చెల్లుతుంది. బాలయ్య బాబు ఎనర్జీ ఎలాంటిదంటే.. మా పిల్లలు పెరిగి పెద్దవాళ్లయినా ఆయన హీరోగానే ఉంటారు’ అని లోకేశ్ ప్రశంసించారు.
Go Back to Shorts
Vijayawada
Nara Lokesh

More Telugu News