'ఈ అమ్మాయి పడట్లేదురా... రేపన్నా పడేయాలి' అంటున్న యోగి మాటలు విన్నాను: నటి హారిక
- నన్ను ట్రాప్ చేసి పడేయాలని చూశాడు
- మంచి ఫ్రెండేనని అనుకున్నాను
- నా స్నేహితురాళ్లతో సంబంధాలున్నాయి
కానీ, తరువాత నాకు తెలిసింది. తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, అరే... ఈ అమ్మాయి పడట్లేదురా... రేపన్నా పడేయాలి. తరువాతైనా పడేయాలి అని చెబుతున్నాడు. నా ఫ్రెండ్స్ తో రిలేషన్స్ లో ఉండి వాళ్ల పిక్చర్స్, వాళ్ల పర్సనల్ విషయాలు నాతో షేర్ చేసుకునేవాడు. ఇది కరెక్ట్ కాదనిపించి, నా ఫ్రెండ్ కు కాల్ చేసి చెప్పాను. తన బర్త్ డే నాడు కాల్ చేసి... ఓ సిస్టర్ లా చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండు ఇతనితో అన్నాను. ఆ అమ్మాయి యోగికి ఫోన్ చేసి తిట్టిందట. ఏదో ఫ్రెండ్ అని షేర్ చేసుకుంటే, నువ్వు అందరికీ వాటిని చూపిస్తున్నావా? అని తిట్టడంతో, యోగికి కోపం వచ్చి, దాన్ని నాపై ప్రదర్శించడం మొదలు పెట్టాడు" అని ఆరోపించింది.