ప్రియాంక చోప్రాకు గౌరవ డాక్టరేట్.. ప్రకటించిన బరేలీ అంతర్జాతీయ యూనివర్సిటీ
- ఐదేళ్ల తర్వాత స్వస్థలానికి విచ్చేయబోతున్న ప్రియాంక
- అందుకు జ్ఞాపకంగా డాక్టరేట్
- ఆనందం వ్యక్తం చేసిన ప్రియాంక తల్లి మధు చోప్రా
తన కుమార్తెకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలో యునిసెఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ కార్యక్రమం తర్వాత బరేలీ బయల్దేరనున్నారు.