నా బ్యాంక్ ఖాతాను ఇంకా ఆధార్‌తో అనుసంధానం చేయలేదు: మాజీ ఆర్థికమంత్రి
- అన్నింటికి ఆధార్ అనుసంధానాన్ని ఖండించిన చిదంబరం
- వ్యతిరేకించిన ఇన్ఫోసిన్ చైర్మన్ నారాయణమూర్తి
- ఐఐటీ ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం, నారాయణమూర్తి
అయితే అదే కార్యక్రమానికి హాజరైన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి, చిదంబరం చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. మాజీ మంత్రి చిదంబరం మాట్లాడిన అంశాలన్నీ ఈ రోజుల్లో గూగుల్‌లోనే దొరుకుతున్నాయని అన్నారు. అయితే వ్యక్తిగత విషయాలను భద్రపరచడం ప్రభుత్వ కర్త్యవమని, ఆ వివరాలు హ్యాకర్ల చేతిలో పడకుండా ఉండేందుకు పార్లమెంట్ చట్టం చేయాలని నారాయణ మూర్తి సూచించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించే చట్టాలు ఉన్నంత వరకు ఎవరికీ ఎటువంటి సమస్య ఉండదని నారాయణమూర్తి తెలిపారు.