Mahesh Babu: కొరటాల రీ షూట్ నిర్ణయం .. మహేశ్ లో పెరుగుతోన్న టెన్షన్?

షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలనే నిర్ణయానికి కొరటాల వచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ముఖ్యంగా రష్ చూసిన తరువాత .. అసెంబ్లీ సీన్స్ రీ షూట్ చేయాలనుకుంటున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. అసలే రెండు భారీ పరాజయాలతో వున్న మహేశ్ బాబును .. కొరటాల ఈ విధంగా రీ షూట్ పెట్టడం మరింత టెన్షన్ పెడుతోందట. ఇక నిర్మాతలు కూడా భారీగా బడ్జెట్ పెరుగుతుండటం పట్ల ఆందోళన చెందుతున్నారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఈ ప్రభావం విడుదల తేదీపై పడుతుందేమో చూడాలి.     
Go Back to Shorts
Mahesh Babu
koratala

More Telugu News