vijay devarakonda: విజయ్ దేవరకొండ ఫస్టు తమిళ సినిమా ఖాయమైపోయింది!

షార్ట్స్‌లో చూడండి
'అర్జున్ రెడ్డి' సినిమా హిట్ తో విజయ్ దేవరకొండకి యూత్ లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఆయనకి అవకాశాలు వరుసబెడుతున్నాయి. తెలుగులో దాదాపు అరడజను సినిమాలు ఆయన చేతిలో వున్నాయి. ఈ నేపథ్యంలో తమిళం నుంచి కూడా ఆయనకి అవకాశాలు వస్తున్నాయి.

గతంలో విక్రమ్ తో 'ఇరుముగన్' చేసిన దర్శకుడు ఆనంద్ శంకర్, ఇటీవల విజయ్ దేవరకొండకి ఒక కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో ఆ తమిళ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందనే విషయంలో సందేహం ఉండేది. ఈ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. స్టూడియో గ్రీన్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ తమిళ సినిమాతో .. అక్కడ కూడా మనవాడు తన హవాను మొదలుపెడతాడేమో చూడాలి. 
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News