తెలుగు ప్రపంచ మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం!
ఐదు రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు కాసేపట్లో ముగియనున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. కాసేపట్లో రాష్ట్రపతి మహాసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ముగింపు వేడుకలకు భాషాభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సభలు నిర్వహించిన కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.