అందుకే నాకు శోభన్ బాబు గుర్తుకు వస్తారు: పరుచూరి గోపాలకృష్ణ
- భూమి విలువ చెప్పిన హీరో శోభన్ బాబు
- స్థలాలు కొనుక్కోమని అందరికీ చెప్పేవారు
- ఆయన నుంచి ఎంతోమంది స్ఫూర్తిని పొందారు
"మా గెస్టు హౌస్ చూడగానే నాకు శోభన్ బాబు గుర్తుకు వస్తారు. ఇండస్ట్రీలో వున్న ఎంతోమందికి భూమి విలువ చెప్పినాయన ఆయన. "నీ దగ్గరికి ఒక రూపాయి వస్తే .. ఇంకో రూపాయి అప్పుచేసైనా వెంటనే భూమి కొనేసేయ్ .. ఆ తరువాత ఈ అప్పు తీర్చుకో" అని చెప్పేవారు. చంద్రమోహన్ .. మురళీ మోహన్ .. శ్రీధర్ ఆయన నుంచి స్ఫూర్తిని పొందినవారే. అలా నేను కూడా హైదరాబాదులో ఓ స్థలం కొనుక్కుని గెస్ట్ హౌస్ కట్టుకున్నాను. అందుకే, ఈ గెస్ట్ హౌస్ చూడగానే నాకు శోభన్ బాబు గుర్తుకు వస్తారు" అని చెప్పుకొచ్చారు.