వైరల్ ఫొటో: బిడ్డకు జన్మనివ్వడానికి ముందు వరకు పరీక్ష రాసిన తల్లి!
- పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నేజియా థామస్
- పరీక్షల్లో కూడా మంచి మార్కులు
- పొగిడేస్తున్న నెటిజన్లు
తాను మగబిడ్డకి జన్మనిచ్చినట్లు మరో పోస్ట్‌లో నేజియా వెల్లడించింది. నేజియా పరీక్ష రాస్తూ ఉన్న ఫొటోకి ఇప్పటికి 1.5 లక్షల వరకు లైకులు, 27వేలకి పైగా రీట్వీట్లు వచ్చాయి. అలాంటి సమయాల్లోనూ చాలా ధైర్యాన్ని ప్రదర్శించి, చదువును నిర్లక్ష్యం చేయకపోవడాన్ని నెటిజన్లు విపరీతంగా పొగిడేస్తున్నారు.
కాగా, అమెరికాలోని కాన్సస్‌లో జాన్సన్ కౌంటీ కమ్యూనిటీ కాలేజీలో నేజియా, సైకాలజీ చదువుతోంది. గర్భం దాల్చిన తర్వాత 39 వారాల వరకు ఆమె కాలేజీలోనే ఉండడం విశేషం.