vijay devarakonda: 'మహానటి'లో చేస్తోన్న పాత్రపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఆయన చేస్తోన్న సినిమాల జాబితాలో 'మహానటి' ఒకటి. సావిత్రి జీవితచరిత్రగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుంటే ..  సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.

 ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ఎంపిక జరిగింది. దాంతో ఆయన ఎన్టీఆర్ పాత్ర చేస్తున్నాడనీ .. ఎంజీఆర్ పాత్ర చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి విజయ్ క్లారిటీ ఇచ్చాడు. "నేను ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను గానీ .. ఎంజీఆర్ పాత్రను గాని చేయడం లేదు. ఓ జర్నలిస్ట్ గా మాత్రమే కనిపించనున్నాను. నిడివి పరంగా చూసుకుంటే నా పాత్ర చిన్నదే అయినా, ఓ మహానటి జీవిత చరిత్రగా తెరకెక్కుతుంది కనుక ఓకే చెప్పేశాను" అన్నాడు.  
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News