vijay devarakonda: 'అర్జున్ రెడ్డి'ని 'ట్యాక్సీవాలా' మరిపించడం ఖాయం: విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
'అర్జున్ రెడ్డి' సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. " 'అర్జున్ రెడ్డి' సినిమా చేస్తున్నప్పుడే .. ఇంతవరకూ ఎవరూ చేయని సినిమాను నేను చేస్తున్నానని అనిపించింది. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అనుకున్నాను .. అలాగే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది" అన్నాడు.

 "ప్రస్తుతం నేను 'ఏ మంత్రం వేశావే' .. 'మహానటి' .. 'ట్యాక్సీ వాలా' సినిమాలు చేస్తున్నాను. 'ట్యాక్సీ వాలా'లో నేను క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాను .. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. నా నుంచి అభిమానులు ఆశించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా విడుదలయ్యాక 'అర్జున్ రెడ్డి'ని మరిచిపోతారు .. అంత డిఫరెంట్ గా 'ట్యాక్సీ వాలా' ఉంటుందని చెప్పుకొచ్చాడు.   
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News