రవితేజ సినిమా కోసం కుదిరితే రకుల్ ..లేదంటే లావణ్య త్రిపాఠి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ సినిమా కోసం కుదిరితే రకుల్ ..లేదంటే లావణ్య త్రిపాఠి!

  • రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ మూవీ 
  • కుటుంబ నేపథ్యంతో కూడిన కథాంశం 
  • కథానాయిక విషయంలో రానున్న స్పష్టత
'సోగ్గాడే చిన్ని నాయనా'తో నాగార్జునకు .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో చైతూకు హిట్స్ ఇచ్చాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల మధ్య అందమైన కథలను అల్లడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. అలాంటి కల్యాణ్ కృష్ణ .. రవితేజ హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పల్లె వాతావరణంలో .. కుటుంబ నేపథ్యంలో కొనసాగనుందని అంటున్నారు. ఎమోషన్ ను ..కామెడీని కలిపి అందించేదిగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

 కల్యాణ్ కృష్ణ ఇంతకు ముందు చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా'లో లావణ్య త్రిపాఠి నాయిక అయితే, 'రారండోయ్ వేడుక చూద్దాం'లో రకుల్ కథానాయికగా నటించింది. అందువలన తాజా చిత్రంలో ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రకుల్ ను సంప్రదిస్తున్నారట .. ఆమె కుదరదంటే లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాను లాంచ్ చేసి .. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.        
raviteja
rakul
lavanya

More Telugu News