రాహుల్, నువ్వు మా మెప్పు పొందేలా పని చేస్తావ్... నాకా నమ్మకం ఉంది: కమలహాసన్ ట్వీట్
- మీ స్థానాన్ని మీరు నిర్వచించుకునే సామర్థ్యం ఉంది
- మీ పెద్దలంటే అభిమానం ఉంది
- మీరు అలానే పనిచేస్తారని ఆశిస్తున్నానంటూ ట్వీట్
47 ఏళ్ల రాహుల్ కాంగ్రెస్ పార్టీకి 49వ అధినేతగా ఈ రోజు తన తల్లి సోనియా గాంధీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖులు రాహుల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాను సైతం రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు కమలహాసన్ ఇటీవలే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్ పదవీ స్వీకారంపై కమల్ స్పందించిన తీరు ఆకట్టుకునేలా ఉంది.