‘నా జీవితంతో ఆడుకున్న నిన్ను వదిలిపెట్టను’.. నటుడు విజయసాయి ఆత్మహత్య కేసులో వైరల్ అవుతున్న వనిత ఆడియో క్లిప్
Add ap7am to your home Screen

‘నా జీవితంతో ఆడుకున్న నిన్ను వదిలిపెట్టను’.. నటుడు విజయసాయి ఆత్మహత్య కేసులో వైరల్ అవుతున్న వనిత ఆడియో క్లిప్

  • ఒత్తిడి భరించలేకే విజయసాయి ఆత్మహత్య
  • వెలుగులోకి వనిత హెచ్చరికల ఆడియో టేప్
  • ముందస్తు బెయిలు కోసం వనిత ప్రయత్నాలు
నటుడు విజయసాయి ఆత్మహత్యకేసులో రోజుకో విషయం బయటపడుతోంది. మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఆధారాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు ముందు భార్య వనితతో విజయసాయి మాట్లాడిన కాల్ రికార్డును పరిశీలించిన పోలీసులు.. అందులో భర్తను వనిత హెచ్చరించినట్టు గుర్తించారు. ‘‘నా జీవితంతో ఆడుకున్న నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అంటూ విజయ్‌ను ఆమె హెచ్చరించిన ఆడియో క్లిప్ వైరల్ అయింది.

మరోవైపు ఆత్మహత్యకు ముందు రోజు కుమార్తె కోసం విజయ్ భార్య ఇంటికి వెళ్లగా ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వనిత హెచ్చరికలు, అడ్వకేట్ ద్వారా మూడు కోట్ల రూపాయల డిమాండ్ వంటి వాటి వల్ల విజయ్ ఒత్తిడికి గురయ్యాడని, అది తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

విజయ్ సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అందిన వెంటనే వనిత, అడ్వకేట్ శ్రీనివాస్‌లను అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు ముందస్తు బెయిలు కోసం వనిత ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.  
Tollywood
Vijay Sai
Suicide
Vanitha

More Telugu News