పారితోషికం పెంచేసిన రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం పెంచేసిన రవితేజ!

  • ఆ మధ్య రవితేజకి వరుస ప్లాపులు
  • అయినా పారితోషికం తగ్గించుకోలేదు 
  • 'రాజా ది గ్రేట్' సక్సెస్ తో పెరిగిన పారితోషికం  
ఒక సినిమా హిట్ అయితే ఆ తరువాత సినిమాకి హీరో హీరోయిన్లు పారితోషికం పెంచడం సహజంగా జరుగుతూ ఉంటుంది. వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ అయితే, పారితోషికం తగ్గించమని వాళ్లని నిర్మాతలు అడగడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వరుస పరాజయాలు ఎదురవుతున్నప్పుడు కూడా పారితోషికం తగ్గించుకోవడానికి రవితేజ ఇష్టపడలేదు. ఈ కారణంగా సెట్స్ పైకి వెళ్లవలసిన సినిమాలు ఆగిపోయాయి కూడా.

అయినా ఆయన 8 కోట్లకి తగ్గనని తేల్చి చెప్పేశాడు. అవకాశాలు రాకపోతే ఖాళీగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' హిట్ కొట్టడంతో, ఆయన తన పారితోషికాన్ని 10 కోట్లు చేసేశాడట. అంత డిమాండ్ చేస్తే అవకాశాలు తగ్గుతాయని చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదట. 'నేను రోజుకు వెయ్యి రూపాయలకి పనిచేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదు .. అలాంటి వాళ్లు ఇప్పుడు సలహాలు ఇవ్వడం బాగోలేదు" అంటూ ముఖానే చెప్పేస్తున్నాడట.      
raviteja

More Telugu News