'ధర్మాభాయ్' గా సాయిధరమ్ తేజ్
Add ap7am to your home Screen

'ధర్మాభాయ్' గా సాయిధరమ్ తేజ్

  • వినాయక్ తో తేజు మూవీ
  • ముందుగా అనుకున్న టైటిల్ 'ఇంటెలిజెంట్' 
  • టైటిల్ మాస్ గా ఉండాలనేది వినాయక్ ఆలోచన 
  • 'ధర్మాభాయ్' ను ఖరారు చేసే ఛాన్స్      
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తాను వినాయక్ తో చేస్తోన్న సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎందుకంటే కొంత కాలంగా ఆయనకి సరైన హిట్ పడలేదు. సాధ్యమైనంత త్వరగా గట్టిగా ఓ హిట్ కొట్టాలని ఆయన భావిస్తున్నాడు. ఆ హిట్ వినాయక్ తో చేస్తోన్న సినిమా వల్లనే సాధ్యమవుతుందనే నమ్మకంతో వున్నాడు. ఈ సినిమాకి 'ఇంటెలిజెంట్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి.

 అయితే కింది తరగతి ప్రేక్షకులకు ఈ టైటిల్ ఎక్కదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దాంతో ఈ సినిమాకి 'ధర్మాభాయ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ అయితే మాస్ ఆడియన్స్ లోకి బాగా వెళుతుందనీ .. తేజుకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కనుక, ఇదే టైటిల్ ను ఖరారు చేద్దామని అనుకుంటున్నారట. టైటిల్ విషయంలో నిర్ణయాన్ని తేజు .. వినాయక్ కే వదిలేశాడట. అందువలన దాదాపుగా ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.   
sai dharam tej
vinayak

More Telugu News