ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి ట్వీట్ చేసిన రోజా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చి... తొలి ట్వీట్ చేసిన రోజా!

  • ఫేస్‌బుక్‌లో రోజాకు రెండు మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు
  • ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇస్తూ 'హెల్లో వైఎస్సార్ కుటుంబం' అని పేర్కొన్న రోజా
  • మరో ట్వీట్ చేస్తూ సీఎం చంద్ర‌బాబుకి హెచ్చ‌రిక‌
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఫేస్‌బుక్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌తిరోజు తాను ప‌ర్య‌టిస్తోన్న ప్రాంతాల‌ను గురించే కాకుండా త‌న కుటుంబ విష‌యాల‌ను కూడా ఆమె తెలుపుతుంటుంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో రెండు మిలియ‌న్ల‌కు పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఇప్పుడు ఆమె ట్విట్ట‌ర్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. "Hello #YSRKutumbam ! @ysjagan @YSRCParty #myfirstTweet" అని ట్వీట్ చేశారు. అనంత‌రం కొద్దిసేప‌టికే మ‌రో ట్వీట్ చేస్తూ.. 'పేద ప్రజల కొరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే చౌక ధరల దుకాణాలను "చంద్రన్న మాల్స్" పేరుతో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ (హెరిటేజ్ ) సంస్థలకు అప్పగించి పేదోడి కడుపు కొడుతున్న బాబు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమిస్తాం' అని హెచ్చ‌రించారు.
roja
twitter
entry

More Telugu News