ప్రియాంక చోప్రాకు మదర్ థెరిసా అవార్డు
- సామాజిక సేవకు గుర్తింపుగా సత్కారం
- షూటింగ్‌లో బిజీగా ఉండి రాలేకపోయిన నటి
- అవార్డు తీసుకున్న తల్లి మధుచోప్రా
ఈ సందర్భంగా మధు చోప్రా మాట్లాడుతూ - 'ప్రియాంకకి చిన్నప్పటి నుండి మధర్ థెరిస్సా అంటే ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్ నివాస్ అనే వృద్ధాశ్రమానికి ప్రియాంక విరాళాలు కూడా ఇచ్చేది. సమాజానికి సేవ చేస్తున్న ప్రియాంక ఈ అవార్డుకు అర్హురాలే' అని మధు చోప్రా అన్నారు.