sharvanand: 'దండుపాళ్యం' దర్శకుడితో శర్వానంద్!
- 'దండుపాళ్యం'తో మెప్పించిన దర్శకుడు
- ఆయన వినిపించిన కథకి ఓకే చెప్పిన శర్వానంద్
- ప్రస్తుతం చేస్తున్న సినిమాలు రెండు
- అవి పూర్తయ్యాక కొత్త ప్రాజెక్టు మొదలు
విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడంలో శర్వానంద్ ఎప్పుడూ ముందుంటాడు. ఈ కారణంగానే ఆయన ఖాతాలో వరుస విజయాలు వచ్చి చేరుతుంటాయి. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే మరో దర్శకుడికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఆ దర్శకుడు ఎవరో కాదు .. 'దండుపాళ్యం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరాజు. కన్నడలో ఆయన తెరకెక్కించిన 'దండుపాళ్యం' .. తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆయన శర్వానంద్ ను కలిసి ఒక కథ చెప్పాడట. కథలోని కొత్తదనం .. కథనంలోని ప్రత్యేకత శర్వానంద్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయట. ఇంతరవరకూ ఈ తరహా పాత్రను తాను చేయకపోవడంతో, శర్వానంద్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి .. మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడని అంటున్నారు.