పవన్ కల్యాణ్... సలహాలు కావాలంటే అడుగు.. ఇవ్వడానికి నేను సిద్ధం: మహేష్ కత్తి
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్... సలహాలు కావాలంటే అడుగు.. ఇవ్వడానికి నేను సిద్ధం: మహేష్ కత్తి

  • రూల్స్ ప్రకారం జనసేన పార్టీనే కాదు
  • ప్రతి దానికీ చంద్రబాబుకు తెలియకపోవచ్చు అంటావేంటయ్యా బాబూ?
  • మంచి సలహాదార్లను నియమించుకో
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ క్రిటెక్ మహేష్ కత్తి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రూల్స్ ప్రకారం చూసుకుంటే జనసేన అసలు పార్టీనే కాదని మహేష్ అన్నాడు. పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక అర్హతలు కూడా జనసేనకు లేవని చెప్పాడు. ఆ పార్టీలో జనం లేరు, సేన లేదని... కేవలం పిచ్చి అభిమానులు, కులపిచ్చిగాళ్లు మాత్రమే ఉన్నారని తెలిపాడు.

'ప్రతి దానికీ చంద్రబాబుకు తెలియకపోవచ్చు అంటావేంటయ్యా బాబూ... ఆయన ముఖ్యమంత్రి కాదా? లేక అంత పనికిమాలిన వ్యక్తి అని నీ అభిప్రాయమా?' అంటూ ఎద్దేవా చేశాడు. మంచి సలహాదారులను, కన్సల్టెంట్లను, లాంగ్వేజ్ ట్రైనర్లను నియమించుకోవాలని సూచించాడు. తనను ఏదైనా సజెస్ట్ చేయమంటే... దానికి తాను సిద్ధమేనని చెప్పాడు.  



kathi mahesh
pawan kalyan
janasena
Chandrababu

More Telugu News