ప్రకాశ్ రాజ్ ను చూసి చాలా అసూయ పడతాను: యమున
Add ap7am to your home Screen

ప్రకాశ్ రాజ్ ను చూసి చాలా అసూయ పడతాను: యమున

  • కొత్త దర్శకులతోను పనిచేయాలనుంది 
  • పాత్రలో కొత్తదనం వుంటే బాగుంటుంది 
  • మంచి సీన్ ఒక్కటి చేసినా చాలు       
నిన్నటి తరం కథానాయికగా యమునకి మంచి గుర్తింపు వుంది. ఆ తరువాత నుంచి ఆమె తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే ఆమెకి కొంత గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఆమె మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఐ డ్రీమ్స్ తో అనేక విషయాలను పంచుకున్నారు. "ఇప్పుడున్న దర్శకులలో ఎవరి శైలి వారిది .. ప్రతి ఒక్కరూ చాలా డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నారు. అందువలన కొత్త దర్శకులతో పాటు అందరితో కలిసి పనిచేయాలనుంది" అని అన్నారు.

 "కాకపోతే నాకొచ్చే పాత్ర బాగుండాలి .. ఆ పాత్రలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఒక్క సీన్ చేసినా అందులో మేజిక్ ఉండాలి .. అలా వుంటేనే బాగుంటుంది. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ గారిని చూసి నేను చాలా జెలసీగా ఫీలవుతాను. నిజానికి నాకు జెలసీ లేదు .. కానీ ఆయన అన్నిరకాల పాత్రలను చేయడం చూసి అసూయ పడతాను. అన్నిరకాల పాత్రలను చేశారాయన .. లేడీస్ కే అలాంటి పాత్రలు పడటం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.   
Prakash Raj
yamuna

More Telugu News