Mahesh Babu: వచ్చే నెలలో 'భరత్ అనే నేను' పాటల చిత్రీకరణ .. రిలీజ్ డేట్ లో మార్పు లేదట!

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' చివరి షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకూ తమిళనాడులోని 'కారైకుడి'లో ఈ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చేనెలలో ఒక ఫైట్ ను .. 3 పాటలను చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ఇంతకు ముందే ప్రకటించారు. అదే రోజున ' నా పేరు సూర్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అప్పటికే '2.0' థియేటర్స్ లో ఉంటుంది. అందువలన ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చనున్నారనీ, రెండు వారాల ముందుగానే విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఈ సినిమా టీమ్ స్పందించింది. ఈ సినిమా రిలీజ్ డేట్  విషయంలో మార్పు జరగనున్నట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే ఏప్రిల్ 27వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతుందని స్పష్టం చేశారు.        
Go Back to Shorts
Mahesh Babu
kiara adwani

More Telugu News