ఆసియా సెక్సీయ‌స్ట్ మ‌హిళ‌ల జాబితా: మొద‌టి స్థానాన్ని తిరిగి కైవ‌సం చేసుకున్న ప్రియాంక‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా సెక్సీయ‌స్ట్ మ‌హిళ‌ల జాబితా: మొద‌టి స్థానాన్ని తిరిగి కైవ‌సం చేసుకున్న ప్రియాంక‌

  • మూడో స్థానానికి ప‌రిమిత‌మైన దీపికా ప‌దుకునే
  • రెండో స్థానంలో టీవీ న‌టి నియా శ‌ర్మ‌
  • జాబితా ప్ర‌క‌టించిన ఈస్ట‌ర్న్‌ ఐ వార‌ప‌త్రిక‌
లండ‌న్‌కి చెందిన ఈస్ట‌ర్న్‌ ఐ వార‌ప‌త్రిక నిర్వ‌హించిన పోల్‌లో ఆసియాలో సెక్సీయ‌స్ట్ మ‌హిళ‌గా ప్రియాంక చోప్రా మొద‌టి స్థానంలో నిలిచింది. గ‌తేడాది ఈ స్థానాన్ని ప్రియాంక నుంచి దీపికా ప‌దుకునే కైవ‌సం చేసుకుంది. కానీ ఈసారి జాబితాలో ప్రియాంక తిరిగి త‌న స్థానాన్ని ప‌దిల పరుచుకుంది. అలాగే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దీపికాను మూడో స్థానానికి నెడుతూ టీవీ న‌టి నియా శ‌ర్మ రెండో స్థానంలో నిలిచింది.

దీనిపై ప్రియాంక స్పందిస్తూ త‌న ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ అవార్డు వ‌చ్చినందుకు త‌న త‌ల్లిదండ్రుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొంది. ఈ జాబితాలో ఇప్ప‌టికే ఐదు సార్లు ప్రియాంక మొద‌టి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో ఉన్న నియా శ‌ర్మ ఈ విష‌యాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని తెలిపింది. ఇంకా ఈ జాబితాలో ఆలియా భ‌ట్‌, మ‌హీరా ఖాన్‌, ద్ర‌ష్టి దామ్ని ఉన్నారు.
sexiest
women
asia
priyanka chopra
deepika padukone
nia sharma

More Telugu News