వాళ్ల బొందండీ... రాష్ట్రంలో జరుగుతున్నదంతా కేంద్రానికి తెలుసు!: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాళ్ల బొందండీ... రాష్ట్రంలో జరుగుతున్నదంతా కేంద్రానికి తెలుసు!: రోజా

  • ఏ కేసులో విచారణ జరిగినా చంద్రబాబుకు చిప్పకూడే గతి
  • ఇక్కడి విషయాలన్నీ కేంద్రానికి తెలుసు
  • నిజమైన బీజేపీ నేతలు చేరవేస్తూనే ఉన్నారన్న రోజా
ఓటుకు నోటు నుంచి ఎన్నో కేసుల్లో ఏ ఒక్కదానిలో విచారణ జరిగినా చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తినాల్సిందేనని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట రూ. 1.20 లక్షల కోట్లు అప్పుతెచ్చుకుని, ఆ డబ్బులను కమిషన్ల రూపంలో వెనకేసుకుని విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.

నితిన్ గడ్కరీతో పోలవరంపై ఇటీవల జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ, "వాళ్ల బొందండీ... కేంద్రమైతే స్ట్రిక్టుగా ఉంది. వారికి అంతా తెలుసు. చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రతి విషయాన్ని సోము వీర్రాజు, పురందేశ్వరి వంటివారు ఎప్పటికప్పుడు కేంద్రానికి అందజేస్తున్నారు కాబట్టి, ఈ మాత్రమైనా... లేకపోతే, ఇక్కడ మంత్రి పదవులు అనుభవిస్తున్నారే మన అసెంబ్లీలో బీజేపీ వారు... వారు తెలుగుదేశం పార్టీ వారా? బీజేపీ వారా? అన్నది తెలియడం లేదు" అన్నారు. నిజమైన బీజేపీ వారు అసలు విషయాన్ని మోదీకి, కేంద్ర మంత్రులకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారని అన్నారు.
Roja
Chandrababu
Polavaram
BJP

More Telugu News